కార్యకర్తల, నాయకుల కోసం ఎందాకైనా పోరాడుతా

0
21

-రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు, జనవరి 13 : గ్రామాల్లో కానీ, వార్డులలో కాని నాయకులు, కార్యకర్తలు చెప్పిన మాటనే వేదవాక్కుగా తీసుకుని వారినే అభ్యర్థులుగా నిలబెట్టడం జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే, వ్యవసాయ మార్కెట్ కమిటీ గౌరవ అద్యక్షులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు వ్యవసాయ ‘మార్కెట కమీటి ఛైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మద్రాసు బస్టాండు వద్ద ఉన్న మార్కెట్ ఆవరణంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅదితిగా వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఆయా ప్రాంతాల నాయకులు, కార్యకర్తులు సూచించిన వారికే మారు మాట్లాడకుండా టికెట్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. నెల్లూరు రూరల పరిదిలోని డివిజన్లలో కార్పోరేటర్ స్థానానికి రిజర్వేషన్లు అనుకూలిస్తే పార్టీ కోసం మొదటి నుంచి ప్రపడిని వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. నమ్మి వెంట నడిచిన ప్రతి కార్యకర్త నాయకుడు సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక అన్నారు. వెంట నడిచే కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేసే విషయంలో రాజకీయంగా వారు నష్టం వాటిల్లికా రాజీపడనన్నారు. నాయకుడికి కార్యకర్తలు, సహచరులు లేకుంటే ఆ పార్టీ నిలబడదన్నారు. పటిష్టమైన వ్యవస్థ అనేది ఉండాలన్నారు. ‘చట్టబద్ధంగా ఏమిజరిగినా ఆ మేలు ముందుగా పార్టీ వాళ్లలకే జరగాలన్నారు. మొదటి నుంచి జెండా మోసి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానన్నారు. రూరల్ నియోజవర్గంలో వైఎస్సార్‌ సీపీ తిరుగులేని శక్తిగా తయారు చేసుకుందామన్నారు. ప్రతి విషయంలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా ఏసునాయుడు నాకు విద్యార్థి దశ నుంచి తెలుసన్నారు.రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడే ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామన్నారు. అందరం కలసి రూరల్ నియోజవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ ఆనం విజయకుమార్‌ రెడ్డి మాట్లాడుతూ చైర్మన్ గా ఎంపికైనా ఏసునాయుడు చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారని, కాని ఇంత వరకు పదవులు రాలేదన్నారు. కాని ప్రస్తుతం పదవి రావడం ప్రతి ఒక్కరికి సంతోషకరంగా ఉందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here