మైనర్ బాలికపై కానిస్టేబుల్ లైంగిక దాడి

0
106

హైదరాబాద్ : నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ ఎస్ జైన్ స్కూల్ సమీపంలో నివాసముంటున్న మైనర్ బాలిక(12)పై లైంగిక దాడి జరిగింది. ఇంటిపక్కనే నివసించే సిటీ క్రైమ్ కానిస్టేబుల్ ఉమేష్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. లాక్‌డౌన్‌తో స్కూల్ లేకపోవడంతో ఇంట్లో ఒంటరిగావున్న బాలికపై ఉమేష్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా ఉమేష్ బాలికకు మేనమామ కావడం విశేషం. అతడికి వివాహం జరిగి ఓ కూతురు కూడా ఉంది. ఈ ఘటనపై బాలిక తల్లి బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. వెంటనే నగర అదనపు పోలీస్ కమిషనర్ షికాగోయల్‌కు సమాచారమివ్వగా బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో,అత్యాచారం కింద కేను నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం కోరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here