శ్రీహరికోట షార్ సెంటర్ లో అగ్నిప్రమాదం

0
115

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం(షార్‌)లో ఫైర్ యాక్సిడెంట్‌ చోటుచేసుకుంది. నెషార్‌లోని ఘన ఇంధన మోటార్లు తయారుచేసే ఎస్‌పీపీ విభాగంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఎలక్ట్రిక్‌ ప్యానెల్‌ గదులు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపుచేశారు. యూపీఎస్‌లో సాంకేతిక లోపంతోనే ఈ అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. రెండు ఎలక్ర్టికల్‌ ప్యానల్స్‌ గదులు దగ్ధమయ్యాయి. ఎస్‌పీపీలోని ఏపీజీడీ-3 భవనంలో అమోనియం పెరాక్లోరైడ్‌ గ్రైండింగ్‌ చేస్తుంటారు. చిన్న ఫైర్ యాక్సిడెంట్ కావడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here