వెంకటగిరి లో నేటి నుంచి నాలుగు చోట్ల నిత్యావసర వస్తువుల విక్రయ కేంద్రాలు… గూడూరు సబ్ కలెక్టర్

0
68

వెంకటగిరి పట్టణంలో ఈరోజు నుంచి నాలుగు చోట్ల నిత్యవసర వస్తువుల విక్రయ కేంద్రాలు: గూడూరు సబ్ కలెక్టర్ గోపికృష్ణ,

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగా వెంకటగిరి పట్టణంలో నేటి నుంచి నాలుగు ప్రదేశాల్లో నిత్యవసర వస్తువుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు గూడూరు సబ్ కలెక్టర్ గోపికృష్ణ మీడియా కు తెలిపారు. వెంకటగిరి పర్యటనలో భాగంగా పట్టణంలోని జూనియర్ కళాశాల ఆవరణ, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం, రాజా వీధిలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఆవరణ , పాల కేంద్రం వద్ద ఉన్న ఖాళీ స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఒక్క విశ్వోదయ జూనియర్ కళాశాల ఆవరణలో మాత్రమే మటన్ , ఫిష్ మార్కెట్ ఉంటుందని, మిగతా మూడు విక్రయ కేంద్రాల్లో కూరగాయలు మాత్రమే అమ్ముతారని ఆయన మీడియాకు తెలిపారు. ఉదయం 6 నుండి 11 గంటల వరకు తిరిగి సాయంకాలం 4 నుండి 7 గంటల వరకు ఈ విక్రయ కేంద్రాలు పనిచేస్తాయని ప్రజలు ఆ సమయంలోనే వస్తు విక్రయ పనులు ముగించు కోవాలని ఆయన వెంకటగిరి ప్రజలకు సూచించారు. వస్తువులు కొనుగోలు చేసే సమయంలో వ్యక్తికి వ్యక్తికి మధ్య దూరం పాటించాలని అదేవిధంగా మాస్కులు ధరించాలని గూడూరు సబ్ కలెక్టర్ గోపికృష్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విక్రయ కేంద్రాల్లో దూరం పాటించేలా బాక్సులు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా Crpc 144 సెక్షన్ అమల్లో ఉందని, అత్యవసరమైతే తప్ప ఏ ఒక్కరు వాహనాల్లో గాని, కాలినడకన గాని బయట తిరగ కూడదని, ఇంటి నుంచి బయటికి రాకూడదని ఆయన అన్నారు. వెంకటగిరి ప్రజలు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు,లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గూడూరు సబ్ కలెక్టర్ గోపికృష్ణ గారు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మార్వో చొప్ప రవీంద్రబాబు, మున్సిపల్ కమిషనర్ బి. జాలి రెడ్డి, వెంకటగిరి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.కె. అన్వర్ భాష, ఎస్సై ఎం. వెంకట రాజేష్ వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here