వైఎస్సార్సిపి విజయ యాత్ర

0
76

కొడవలూరు, అక్టోబర్‌ 01 : నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రామనాధపురం, పద్మనాబాసత్రం, ఇతతోపు, పల్లిపాలెం, గ్రామాల్లో వైఎస్సార్సిపి విజయ యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామా ప్రజలు ఎమ్మెల్యేకి గ్రామా ప్రజలు  పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో రాబోయే రెండు సంవత్సరాలలో, కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలలను తీర్చిదిద్దుతం అని ప్రజలకు తెలిపారు.  చంద్రబాబు నాయుడుకి మతిబ్రామిచ్చి డా,కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యులు పెట్టె బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే, దానిని కూడా మా ప్రభుత్వం పై రుద్దడం ,చంద్రబాబు సరికాదని  తెలిపారు. వార్షిక ఆదాయం 5లక్షల ఉన్న ప్రతిఒక్కరికి వైస్సార్  ఆరోగ్యశ్రీ పథకంలో 2031 జబ్బులకు, ఎన్ని లక్షలైన ఖర్చు అయిన ప్రభుత్వమే భరిస్తుంది. ప్రజలకి భరోసా ఇచ్చారు. అక్టోబర్ 10 వతేది నుండి డా వైఎస్సార్‌ కంటివేలుగు పథకం ద్వారా ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు, ప్రారంభించడం జరుగుతుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వైసిపి, జిల్లా అధికార ప్రతినిది వీరి చలపతిరావు, గంధం శేషయ్య, సూర్యనారాయణ, సతీష్ కుమార్, కొండా శ్రీనివాసులు రెడ్డి, వైసిపి నాయకులు అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here