వైఎస్సార్సీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి

0
26

నెల్లూరు, పిబ్రవరి 09, : నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండల వైఎస్సార్సీపీ నూతన కార్యాలయాన్ని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు.ముత్తుకూరు వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రారంభోత్సవానికి భారీగా తరలివచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు.అన్ని విధాలా అందుబాటులో ఉండేలా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లో ముత్తుకూరు మండలంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ రావడం జరిగింది.గత ప్రభుత్వం ఈ ప్రాంతంలో అభివృద్ధి చేశామని చెప్పడమే తప్ప, చేసింది ఏమి లేదు.నేను గెలిచిన ఈ 7 నెలల కాలంలో ఏవిధంగా అభివృద్ధి చేశానో, గ్రామాల్లోకి వెళితే తెలుస్తుంది.అధికారంలో ఉంటే ఏవిధంగా గ్రామాల్లో అభివృద్ధి చేయవచ్చో చేసి చూపించాను.నియోజకవర్గాన్ని నా సొంత గ్రామంగా భావించి అభివృద్ధి చేస్తున్నాను.కానీ కొందరు విమర్శలు చేసే వాళ్ళు జరుగుతున్న అభివృద్ధిని చూడలేక, కావాలని నాపై విమర్శలు చేస్తున్నారు.ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టాము. నియోజకవర్గ అభివృద్ధి కోసం జోలి పట్టైనా అభివృద్ధి చేస్తాను.నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ, మీ రుణం తీర్చుకుంటాను అని ఎమ్మెల్యే కాకాణి తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here