నెలాఖరులోగా పైపులైన్ల పనులు పూర్తి చేస్తాం

0
178

– రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా|| పి.అనీల్ కుమార్
నెల్లూరు, నవంబర్‌ 04 : నెల్లూరు నగరంలోని 43వ డివిజన్ కోటమిట్ట, ఆలాలిమ్ మసీదు వీధి, పి.ఎన్.ఎం. స్కూల్ వీధి, జెండావీధి మెయిన్ సెంటర్ ప్రాంతాలలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా||
పి.అనీల్ కుమార్ అధికారులతో కలిసి పర్యటించి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం షాదీమంజిల్ నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్‌కు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అనీల్ కుమార్ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీ పనుల నిమిత్తం నెల్లూరు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో గతంలో వాటర్ పైపులైన్లు పరీక్షించకుండా వేశారని, ఈ నెలాఖరులోగా అన్నీ పరీక్షించి పైపులైన్లు పనులు పూర్తి చేస్తామన్నారు. వర్షాలు వచ్చినప్పుడు నీరు ఇంకిపోయే పరిస్థితి లేకుండా రోడ్లకు ఇరువైపులా గోడలకు సిమెంటు రోడ్లు వేశారని, అలాగే డ్రెయిన్లు సరిగా నిర్మించకపోవడంతో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కోవడం జరిగిందన్నారు. హడావుడిగా పనులు చేసి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్నీ పరిశీలించి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు. ఈ నెలఖారులోగా మంచినీటి వసతి కల్పిస్తామని, అలాగే రోడ్లు ఎక్కడెక్కడ మరమ్మతులకు నోచుకుందో ఆయా ప్రాంతాలలో ప్యాచ్ వర్క్ లు కూడా పూర్తి చేస్తామన్నారు. ఎక్కడెక్కడ పెద్ద రోడ్లు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో బిబి రోడ్లు వేయాలని సూచించడం జరిగిందని, బిటి రోడ్లు నిర్మిస్తే వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. వేసవి కాలంలో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయని, ఆ పరిస్థితి తలెత్తకుండా గ్రౌండ్ వాటర్‌ను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మరో 10 రోజుల్లో అన్ని పనులు మొదలు పెడతామని, అలాగే షాదీ మంజిలను త్వరగా పూర్తి చేసి వచ్చే రంజాన్ పండుగ షాదీ మంజిల్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానన్నారు. త్వరలో ప్రతి వార్డులో మొక్కలు నాటడంపై స్పెషల్ డ్రైవ్ తీసుకొస్తామని, అలాగే శానిటేషన్ సమస్యలను కూడ పరిష్కరిస్తామన్నారు. పదేళ్ళ నుంచి సమస్యలపై అనేక పోరాటాలు చేశామని, ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు మాత్రమే అయిందని, గత ప్రభుత్వం అప్పులు మాత్రం మిగిల్చి వెళ్ళారని, అన్నింటిని త్వరలోనే పరిష్కరించుకొని ప్రజలకు ఎటువంటి సమస్యలు ఏర్పడకుండా చూస్తామన్నారు. మరో ఏడాదిన్నరలోగా నెల్లూరు నగరంలో ఎటువంటి సమస్యలు లేకుండ పూర్తిగా మార్చేస్తామని హామీ ఇస్తున్నానన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు ఎండి. ఖలీల్ అహ్మద్, మీరామొహిద్దీన్, అతహర్ బాషా, మునవర్, సమీ, ఆరిఫ్, షేక్ హాజీ, సమయుల్లా, నాసర్, సీకో, సిద్దిక్, ఎస్.ఆర్.ఇంతియాజ్, వేలూరు మహేష్, సత్తార్, తారిక్, ముస్తాక్, నూనె మల్లికార్జునయాదవ్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here