మేము నెల్లూరు జిల్లా వాసులమే – శంభన్‌ కులస్థులు

0
161

నెల్లూరు, నవంబర్‌ 25 : మా పూర్వికుల నుండి ప్రభుత్వం ద్వారా “శంభన్” “ఎస్సి” గా కుల ధృవీకరణ పొంది వున్నామని, ఎస్సి లకు రావలసిన రాయితీలు అన్నియు మా శంభన్ కులస్థులు పొంది వున్నారని, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలో మా కులస్థులు నివసిస్తున్నారని తంబి వెంకట ప్రసాద్‌ తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్‌ నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గూడూరు శాసనసభ సభ్యునిగా వున్న వెలగపల్లి వరప్రసాదరావు ఈ నెల 24న శంభన్ కులస్థుల గురించి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో శంభన్ కులస్థులు లేరని చేసిన విషయం శంభన్ కులస్థులందరి మనోభావాలు దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ పార్లమెంట్ సభ్యునిగా ప్రస్తుత శాసనసభ సభ్యునిగా ఉన్న మీరు “శంభన్” కులస్థులు లేరు అని పత్రికా ముఖంగా మాట్లాడడం చాలా బాధాకరమన్నారు. ఈ విషయము చాలా అవాస్తవం అని Andhra Pradesh Gazette 1997 (G.O.No.58 Social Welfare (J), 12 May, 1997) and Andhra Pradesh Recorganization Act 2014 ప్రకారం శంభన్ కులస్థులు వున్నారని చెప్పారు. బహుజన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉపాధ్యాయ వృత్తిలో వున్న గంగపట్నం మోహన్ అంబేడ్కర్ మాట విని సాటి ఎస్సి కులస్థులైన శంభన్ కులమును, కులస్థులను అవమానించడం తీవ్ర బాధాకరమని అన్నారు. కావున శంభన్ కులస్థుల మీద ఇటువంటి పత్రికా ప్రకటనలు చేయకండని తెలిపారు. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, కావలి, గూడూరు, సర్వేపల్లి, కోవూరు నియోజకవర్గాల ఇతర ప్రాంతాలలో నివశించుచున్న శంభన్ కులస్థుల మీద చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here