ప్రభుత్వానికి రెండు వారాలే గడువు – పవన్‌

0
132

నెల్లూరు, నవంబర్‌ 04, : నన్ను చాలా మంది నమ్మకపోవచ్చు, కానీ నేను మాత్రం మీ కోసం నిలబడతానని ఇంతమంది భవన నిర్మాణ కార్మికులు చచ్చిపోతున్నారు, దాదాపు నెలకి 2.5లక్షల జీతం తీసుకునే వారు ఒక్క 5 నెలలు జీతాలు తీసుకోవడం ఆపండి సూట్ కేస్ సాయి ఒక్కసారి జైల్లో నీ అనుభవాలు చెప్పోయ్ నేను విదేశాలకు వెళ్తే అక్కడి పోలీసులు నాకు సెక్యూరిటీ ఇస్తారు, కానీ దురదృష్టం మన నేల మీద మనకు సెక్యురిటి ఇవ్వరు, మీరు ఇవ్వకపోయినా సరే ముందుకు వెళ్తానే తప్ప ఆగిపోను రాజ్యసభ సభ్యులు అంటే మహానుభావులు, మహానుభావులు కూర్చునే సభలో సూట్ కేస్ కంపెనీలు పెట్టె ఎంపీ విజయసాయిరెడ్డి కూర్చునే దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశానికి వచ్చింది గొప్ప గొప్ప మేధావులు ఉండాలి అని ఏర్పాటు చేసిన రాజ్యసభ వ్యవస్థలో ఎంపీ విజయసాయిరెడ్డి లాంటి వారు కూర్చోవడం కంటే దౌర్భాగ్యం మరొకటి లేదునేను రెండు చోట్లా ఓడిపోయాను కాబట్టి భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడే నైతిక అర్హత నాకు లేదు అని ఎంపీ విజయసాయిరెడ్డి అంటారు, అంబేద్కర్, కాన్షీరాం లాంటి మహనీయులు కూడా ఓడిపోయారు సంవత్సరాల పాటు జైల్లో ఉన్న వారు కూడా నన్ను విమర్శించేవారా? మీరేమైన టంగుటూరు ప్రకాశం పంతులు లా బ్రిటీష్ వారికి ఎదురు తిరిగి జైలుకి వెళ్ళారా? అక్రమంగా ధనాన్ని తరలిస్తూ దోరికిపోయి జైలుకు వెళ్లారు అక్రమంగా సంపాదించి జైలుకి వెళ్లిన ఎంపీ విజయసాయిరెడ్డి లాంటి వారు నాయకులు అవ్వడం మా దురదృష్టం, ఎందుకులే అని నేను ఊరుకుంటే పరిధి దాటుతున్నారు , పరిధి దాటితే తాట తీసి క్రింద కూర్చోబెడతా విజయసాయిరెడ్డి అనగానే భయపడాలా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎంపీ విజయసాయిరెడ్డి, నా డిఎన్‌ఏగురించి మాట్లాడే హక్కు ఏ ఒక్క వైఎస్సార్‌ పార్టీ నాయకుడికి లేదు వైసీపీ వారికి రెండు వారాల గడువు ఇస్తున్నాం, వరదలు, వర్షాలు మాకు అనవసరం, భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ ఫండ్ 12 వందల కోట్లు ఉన్నాయి, వాటి నుంచి ఒక్కొక్కరికి 50 వేలు ఇవ్వండి -ఎవరైనా అధికారంలోకి వస్తే శుభంతో మొదలుపెడతారు, కానీ వైఎస్సార్‌ పార్టీ కూల్చివేతలతో మొదలుపెట్టారు, మీ ప్రభుత్వం కూడా కూలిపోతుంది ప్రత్యేక హోదా కోసం ప్రజలు వదిలేసిన సరే నేను ఆశయం అనే పిచ్చితనంతో బిజెపితో, ప్రేమగా ఉండే ప్రధాని నరేంద్రనమైడీతో కూడ విభేదించాను నేను పొత్తు పెట్టుకోవాలి అనుకుంటే దర్జాగా ఎన్నికల ముందు టిడిపి తో పొత్తు పెట్టుకుని గెలిచేవాడిని, కానీ నాకు ప్రజలకు ఇష్టం లేని పనులు నేను చేయను అందుకే ఒంటరిగా పోటీచేసాను చాలా మందికి నాకు బ్రతకడం రాదు అని అంటారు. మున్ముందు మీరు చదువుకునే పుస్తకాలలో ఉండే వారు బ్రతికి ఉన్నాడు అని నిరూపించడానికి నేను ఇక్కడ ఉన్నాను. రేపు వరస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టించి బీటీం దత్తపుత్రుడు ప్యాకేజీ అని మొరగమంటారు పవన్ మీద జగన్ రెడ్డి ఇదో పెద్ద స్ట్రాటెజీ అన్నట్టు ఆహ ఓహో అని ఇక్కడ పేటీఎం వెదవల బిల్డప్పులు ఇస్తారు. రెండు సంవత్సరాల నుంచి ఇదే మీరు ఎక్కువగా చిందులు వేస్తే మిమ్మల్ని ఎలా కట్టడి చేయాలో నాకు తెలుసు, చాలామంది బలమైన వ్యక్తులు తెలిసిన వాడిని , ఈ దేశాన్ని పరిపాలించే వ్యక్తులకు మీరు చేస్తున్నవి చెప్తాను ఇందాక కరెంట్ షాక్ కు గురైన యువకుడు అపోలో ఆసుపత్రిలో క్షేమంగా ఉన్నాడు ఒక బహిరంగ సభలో ఒక నాయకుడు ఒక నిమిషం మౌనం పాటిద్దాం అంటే అంత మంది ఉన్న ప్రాంగణం ఒక్కసారి నిశ్శబ్దంగా మారిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here