14 నుంచి వార్డు కార్యదర్శుల శిక్షణా తరగతులు

0
71

– వారం రోజుల పాటు రెసిడెన్షియల్ శిక్షణ- కమిషనర్ పివివిస్ మూర్తి

నెల్లూరు, అక్టోబర్‌ 12 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ వార్డు కార్యదర్శుల నియామక ప్రక్రియలో భాగంగా నూతనంగా ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 14వ తేదీ నుంచి స్థానిక నార్త్ రాజుపాలెం సమీపంలోని ఆదిశంకర (బాలాజీ) ఇంజినీరింగ్ కళాశాలలో శిక్షణా తరగతులను ఏర్పాటు చేస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ పివివిస్ మూర్తి తెలిపారు. వివిధ శాఖల ప్రభుత్వోద్యోగులు, ఎన్జీవోలు, నిష్ణాతులైన శిక్షణా సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు మిగిలిన 6 మున్సిపాలిటీలలో మొత్తం 680 మంది అభ్యర్థులను ఎంపిక చేసి పోస్టింగ్ ఉత్తర్వులు జారీచేశామని తెలిపారు. మొత్తం ఐదు బృందాలుగా అభ్యర్థులను విభజించి ప్రతీ బృందానికి వారం రోజుల పాటు ప్రాధమిక శిక్షణతో పాటు భోజనం, విశ్రాంతి తీసుకునేందుకు వసతులు కల్పిస్తున్నామని కమిషనర్ పేర్కొన్నారు. కేటాయించిన కళాశాల ప్రాంగణంలోనే శిక్షణ జరిగే వారం రోజుల పాటు అభ్యర్థులు తప్పనిసరిగా తర్ఫీదును పొందాలని కమిషనర్ సూచించారు. మునిసిపల్ శాఖలకు చెందిన వార్డు వెల్ఫేర్ & డెవలప్మెంట్ సెక్రెటరీ, వార్డు ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు శానిటేషన్ & ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రెటరీ, వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, వార్డు ఎమినిటీస్ సెక్రెటరీ విభాగాల ఉద్యోగాల శిక్షణతో పాటు, ఏ.ఎన్.ఎమ్, మహిళా పోలీస్, ఎనర్జీ అసిస్టెంట్, విఆర్వో విభాగాల్లో మొత్తం 1500 మందికి శిక్షణా తరగతులు నిర్వహించనున్నామని స్పష్టం చేసారు. శిక్షణా సమయంలో క్రమశిక్షణ పాటిస్తూ, అధ్యాపకుల నుంచి తమ విభాగాలకు చెందిన సమాచారాన్ని విస్తృతంగా తెలుసుకోవాలని అభ్యర్థులకు కమిషనర్ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here