మంత్రి కొడాలి నాని వైఖరిని ఖండిస్తూ టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నిరసన

0
153

నెల్లూరు, నవంబర్‌ 29 : తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకర్ల తిరుమల నాయుడు ఆధ్వర్యంలో నగరంలోని విఆర్సి సెంటర్ వద్ద నిరసన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి కొడాలి నాని వైఖరిని ఖండించారు. కొడాలి నాని ముఖ చిత్రాలతో కూడిన ఫుట్ బాల్ ను కాళ్ళతో తంతూ ఫుట్ బాల్ ఆటను ఆడి నిరసన తెలియజేసారు. ఈ సందర్భంగా టిఎన్ ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కాకర్ల తిరుమల నాయుడు మాట్లాడుతూ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు ని లక్ష్యంగా చేసుకొని 13 జిల్లాలలో ఫుట్ బాల్ ఆడుతామని బెదిరిస్తూ గౌరవప్రదమైన మంత్రి హోదాలో ఉన్న కొడాలి నాని వ్యాఖ్యానించడం సిగ్గు చేటు అన్నారు. వెంటనే కొడాలి నాని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని శ్మశానం తో పోలుస్తూ, పశువులు తిరుగుతున్నాయని అవహేళన చేస్తూ రాజధాని ప్రతిష్టను దిగజార్చుతున్న మంత్రుల వైఖరిపై నిరసన తెలిపారు, రాష్ట్ర ప్రజల, ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని , తనపై తెలుగుదేశం పార్టీపై కోపంతో తెలుగు ప్రజల భవిష్యత్తును రాజధాని అభివృద్ధిని అంధకారం చేయవద్దని కోరటమే చంద్రబాబు చేసిన తప్పా! అన్నారు. చంద్రబాబు బస్సు పైకి కక్షపూరితంగా రాళ్లు ,చెప్పులు విసిరి వేయించింది కాక పైపెచ్చు 13 జిల్లాల్లో ఎక్కడైనా ఫుట్ బాల్ ఆడతామని నిస్సిగ్గుగా చెప్పడం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్రుల్లా, నాయకులు సురేంద్ర బాబు, నవీన్, నాగేంద్ర, ప్రసాద్ అక్షయ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here