జీవోనెం.81ను విమర్శించే వారు రాష్ట్రద్రోహి – సయ్యాద్ నిజాముద్దీన్

0
60

నెల్లూరు, నవంబర్‌ 13 : జీవో నెం .81 వలన వచ్చే 15 ఏళ్ళలో ఎన్నో అద్భుతమైన మార్పులు సంభవించబోతున్నాయని, పిల్లల భవిష్యత్తు ఏంతో గొప్పగా ఉండబోతుందని ఆదాల ప్రభాకర్ రెడ్డి హెల్పింగ్ హాండ్స్ అధ్యక్షులు సయ్యాద్ నిజాముద్దీన్ పేర్కొన్నారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంగ్లం అంతర్జాతీయ భాష అని తెలుగు మన రక్తంలోనే ఉందని పేర్కొన్నారు. ఆంగ్ల విద్యా బోధన వలన బడుగు బలహీన వర్గాల ప్రజలు విద్యాపరంగా అభివృద్ధి సాధిస్తారని అన్నారు. ప్రతిపక్ష నాయకుల విమర్శలను కొట్టిపారేశారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌, నెహ్రూ, గాంధీజీ లాంటివారు కూడా ఇతర దేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించారన్నారు. ఆంగ్లవిద్య వలన రాబోయే తరాలు ఎంతో ఉన్నత స్థానాలు అధిరోహిస్తారని, ఆంధ్ర అంటే ఆంగ్లం, ఆగ్లం అంటే ఆంధ్రా అన్న స్థితికి చేరుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరైతే జీవోనెం.81ను విమర్శిస్తారో వారు రాష్ట్ర ద్రోహులని అబివర్ణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here