యస్పి ‘స్పందన’ కార్యక్రమానికి ఫిర్యాదుల వెల్లువ

0
151

జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన “స్పందన”కు మొత్తం”125″పిర్యాదులు
స్పందన లో సత్వర పరిష్కారం పొంది, యస్పి కి కృతజ్ఞతలు తెలిపిన వృద్ధ దంపతులు
నెల్లూరు, నవంబర్‌ 11 : ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక “స్పందన” కార్యక్రమంనకు అందిన పిర్యాదులను నిర్దేశించిన గడువు లోగా పరిష్కరించాలని జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న”స్పందనను” వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా యస్పి ఐశ్వర్య రాస్తోగి పర్యవేక్షిస్తూ సంబందిత పోలీసు అధికారులకు తగు సలహాలు అందించారు. సోమవారం స్పందన కార్యక్రమం జిల్లా పోలీసు కార్యలయంలో ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 02.30 గంటల వరకు జిల్లా యస్పి నిర్వహించారు. స్పందనకు జిల్లా నలుమూలల నుండి మొత్తం 125 ఫిర్యాదులు అందినవి. స్పందనలో యస్పికి పిర్యాదు చేసిన కలపాటి రంగమ్మ, ఆమె భర్త మునికృష్ణ, వయస్సు సుమారు 60 సంవత్సరాలు గల వృద్ధ దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలు కలిగి ఉండి, చిన్న సైకిల్ షాపును నడుపుతూ జీవనం చేస్తున్నట్లు, పొరిగింటి వారితో ఇంటి హద్దులు, దారి విషయంలో గత 8 ఏళ్ళుగా ఉన్న సమస్యను 7 రోజులలో పరిష్కారం చూపినందుకు జిల్లా యస్పికి సి.ఐ. నవాబ్ పేట వేమారెడ్డి స్పందన సిబ్బంది సమక్షంలో కృతజ్ఞతలు తెలుపుకున్నారు.ఈ రోజు వచ్చిన పిర్యాదులలో భార్యా భర్తల గొడవల కేసులు, ఇళ్ళ స్థలాలు, భూ తగాదాల సివిల్ కేసులు, సైబర్ నేరాలు, చీటింగ్ కేసుల గురించి వచ్చిన ఫిర్యాదులు ఎక్కవగా ఉన్నవి. అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన జిల్లా యస్పి వాటిని సంబంధిత అధికారులకు ఎన్టార్స్ చేయుచూ చట్ట ప్రకారం విచారణ జరిపి, ఫిర్యాదు దారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమానికి యస్పితో పాటు అడిషనల్ యస్.పి.(క్రైమ్స్) పి.మనోహర్ రావు, యస్.బి. డియస్పి యన్. కోటా రెడ్డి, నెల్లూరు టౌన్ డియస్పి జె.శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు రూరల్ డియస్పి రాఘవ రెడ్డి హాజరుగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here