21, 22వ డివిజన్ రూపురేఖలు త్వరలో మారుస్తాం

0
100

– రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నెల్లూరు, డిసెంబర్‌ 16 :నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21, 22న డివిజన్లలోని యన్.జి.ఓ. కాలనీలో 10 లక్షల రూపాయలతో ప్యాచ్ వర్కులకు నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంఖుస్థాపన చేశారు.ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ మా సోదరుడు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం 21, 22 డివిజన్ అభివృద్ధి 2 కోట్ల 70 లక్షలతో ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా సోదరుడు ఈ ప్రాంత అభివృద్ధికి తన శక్తిమేర కృషి చేశారని చెప్పారు. కష్టకాలంలో తమతో వెన్నంటి నడచిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం ఎప్పుడూ ఉంటాయన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here