ఆంధ్రాబ్యాంకు విలీనం రద్దు చేయాలి

0
226

నెల్లూరు, సెప్టెంబర్‌ 14 : ఆంధ్రాబ్యాంకు సంబందించిన అన్నీ సంఘాల నాయకులు ఆంధ్రాబ్యాంకు అధికారులు ఉద్యోగులు విశ్రాంత ఉ ద్యోగులు సీమాంధ్ర బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వుల్లిపాయల శంకరయ్య సంఘం నాయకులు వై.యస్.ఆర్.సి.పి. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిని, రూరల్ నియోజక వర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కలిసి ఆంధ్రాబ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమని ఆంధ్రాబ్యాంకు విలీనాన్ని నిలుపుదల చేయాలని వినతిపత్రాలను ఇవ్వడం జరిగినది. ఎమ్మెల్యేలు సానుకూలంగా స్పందించి సి.యం. దృష్టికి తీసుకెల్లి మీ సమస్యలను తెలియచేస్తామని చెప్పారు. వి.ఉదయ్ కుమార్ ఆంధ్రాబ్యాంకు యూనియన్ నాయకులు, వుల్లిపాయల శంకరయ్య సీమాంధ్రా బి.సి. సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పేర్లతో బ్యాంకులు వున్నవి అందులో ఆంధ్రాబ్యాంకు ఆదాయంలోముందున్నది ఇంటి బ్యాంకును నష్టాలల్లో వున్న బ్యాంకులో విలీనం చేయడం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి ఆంధ్రాబ్యాంకు విలీనాన్ని నిలుపుదల చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కంచి వెంకటేశ్వరరావు, ఆర్.మల్లికార్జునరావు, ఆర్.వి. సుబ్బారావు, జి.లక్ష్మణ్ కుమార్ రెడ్డి, ఎ.అనిల్ కుమార్, ఎ.పెంచల రెడ్డి, ఎన్.వి.ఎస్.ప్రసాద్, జి.వి.రమణారెడ్డి, వి.ఎ. లింకన్, జి. కృష్ణ మోహన్, డి.రమణయ్య, బి.సుధీర్ కుమార్, పి.సుధాకర్, షేక్ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here