ఘనంగా మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు

0
162

నెల్లూరు, అక్టోబర్‌ 31 : నెల్లూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాభవన్లో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఇందిరాభవన్ లోని ఇందిరమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆర్టీసీ కూడలి వద్ద గల ఇందిరమ్మ విగ్రహం వద్దకు చేరుకుని ఇందిరాగాంధీ కూడా నివాళులర్పించారు. ఇందిరాగాంధీ జోహార్ అని నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణుల,అభిమానులను ఊద్దేశించి మాట్లాడుతూ..దేశంలో ఘనకీర్తి సాధించిన గొప్ప కుటుంభం గాంధీ కుటుంభం.దేశ సమగ్రాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి ప్రాణత్యాగాలు చేసిన ఘనత జవహర్లాల్ నెహ్రు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లది. గరీభీ హఠావో నినాదంతో రాజరికాన్ని రద్దు చేసి,బ్యాంకు లను జాతీయం చేసి దేశ ప్రజలకు అండగా నిలిచిన ఘనత స్వర్గీయ ఇందిరాగాంధీది. దేశ ప్రగతికి ఎంతగానో కృషి చేసిన ఇందిరమ్మను నాటి భాజపా నాయకులు స్వర్గీయ ఆటలబిహారి వాజ్పేయి చే అపర దుర్గాదేవిగా కీర్తించబడిన ఘనత ఇందిరమ్మది.నేటికి దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసిన మహానీయురాలు స్వర్గీయ ఇందిరాగాంధీ.నాటి నెహ్రు నుండి నేటి రాహుల్ గాంధీ వరకు దేశప్రజల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప కుటుంభం గాంధీ కుటుంబం. మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేను దేవుడిగా పూజించే భాజాపా నాయకులు నేడు ప్రజల మన్నల కోసం 15 రోజుల గాంధీ సంకల్ప యాత్రతో దేశ ప్రజలకు ఏ విధమైన సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. ప్రస్తుత భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా.లక్ష్మీనారాయణ ఏ పార్టీకి చెందినవాడో చెప్పాలన్నారు. భాజపాకు దేశ ప్రజల్లో ఆదరణ రావాలంటే కాంగ్రెస్ పార్టీపై అసత్యప్రచారం కాకుండా ప్రజలకు ఉపయోగకరంగా సంస్కరణలు చేపట్టాలని సూచించారు.ఇప్పటి వరకుబ్యాంకు ఎగవేత దారులపై,ఆర్ధిక నేరగాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని డిమాండ్ చేశారు.దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన భాజపా ప్రభుత్వం ఇకపై కాంగ్రెస్ పార్టీని, గాంధీ కుటుంబాన్ని అసత్య ఆరోపణలతో విమర్శలు చేస్తే సరికాదని హెచ్చరించారు. ఇప్పటి వరకు దేశంలో జరిగిన అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినవే అని గుర్తు చేశారు.దేశం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ఇతర రాజకీయ పార్టీలు పేరు మార్చుకొని తమావిగా చెప్పుకుంటున్నారన్నారు.ఈ కార్యక్రమంలో సివి.శేషారెడ్డి,రఘురాం ముదిరాజ్, సురేష్ బాబు, శ్రీనివాసులు రెడ్డి, ఫయాజ్, షబ్బీర్, అల్లావుద్దీన్, మోహన్ రెడ్డి, కొండా.అనిల్ కుమార్, అమీనా, ఏ.రాంప్రసాద్, గణేష్, ప్రసాద్, కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here