బిసి సమ్మేళనం

0
175

నెల్లూరు, సెప్టెంబర్‌ 22 : నెల్లూరు నగరంలోని స్థానిక పరమేశ్వరి కళ్యాణ మండపం నందు జిల్లా బిసి మహా సభను జిల్లా అధ్యక్షులు తాళ్ళూరు రాము ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య మెుట్టమెుదటిగా బాలాజి నగర్‌ కూడలి నందు పూలే దంపతుల విగ్రహానికి పూలమాలలు సమర్పించి భారీ బైక్‌ ర్యాలీతో కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాంత్రత్యం సిద్దంచి 70ఏళ్ళు దాటినా దేశంలోని బిసిల స్థితి గతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే చందంగా వుందని దేశంలోని వెనుక బడిన సామాజిక వర్గాలకు సమన్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బిసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు, రాష్ట్ర మహిళా అద్యక్షురాలు యలగాల నూకానమ్మ, నూర్‌ బాషా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాలేషా, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here