పురాతన ఆలయాలను కాపాడుకోవాలి

0
160

నెల్లూరు, అక్టోబర్‌ 01 : అలనాటి పురాతన ఆలయాల అభివృద్దికి దాతలు ముందుకు వచ్చి కాపాడుకోవాలని వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు.మనుబోలు మండలంలోని పిడూరు లో శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న మహాకుంభాభిషేకం కార్యక్రమాల్లో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. పిడూరు గ్రామ మాజీ సర్పంచ్ మన్నెమాల సాయిమోహన్‌ రెడ్డి, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజాధి కార్యక్రమాల చేశారు. అనంతరం ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం యువత హిందూ సనాతన ధర్మాలకు, ఆచారాలకు దూరమవుతోందన్నారు. ఇలాంటి తరుణంలో గ్రామాల్లోని పురాతన ఆలయాలను బాగుచేయించి కాపాడుకోవడం హర్షించదగ్గ విషయమేనన్నారు. ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ ఏ పని చేయాలన్నా సంకల్పం గట్టిదై ఉండాలన్నారు. దీనికి తోడు ప్రజా సహకారం ఉండాలన్నారు. ఈ రెండు కలవడంతోనే సాయిమోహన్‌ రెడ్డి ఓ మంచి శివాలయాన్ని రూపుదిద్దగలిగారన్నారు. ఆలయాల నిర్మాణాలకు దాతలు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆనం జయకుమార్‌ రెడ్డి, ఆనం రంగమయూర్‌ రెడ్డి, మండలంలోని అన్ని పార్టీల రాజకీయ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here