శబరిమలకు ఆర్టీసీచే ప్రత్యేక సర్వీసులు

0
104

నెల్లూరు, నవంబర్‌ 06 : నెల్లూరు నగరంలోని స్థానిక ఆత్మకూరు బస్టాండ్‌(పిఎస్‌ఆర్‌) నందు శబరిమల భక్తుల కొరకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రీజనల్‌ మేనేజర్‌ రామమ్‌ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం రామమ్‌ మాట్లాడుతూ శబరిమల భక్తుల కొరకు వివిధ రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలియజేశారు. ఈ అవకాశాన్ని శబరిమలకు వెళ్లే భక్తులు వుపయోగించుకావాలని, వివరాల కొరకు ఆర్టీసీ బస్టాండ్‌లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌ నందు వివరాలు తెలుసుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్‌ శివకేశ్‌యాదవ్‌, అసిస్టెంట్‌ డిపో మేనేజర్‌ బుజ్జమ్మ, తదితర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here