అల్లీపురంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

0
160

అన్ని సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే
నెల్లూరు, అక్టోబర్‌ 24 : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు నగరపాలక సంస్థ కమీషనర్ తో కలసి 2వ డివిజన్అల్లీపురంలో పర్యటించారు. గ్రామస్థులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ అల్లీపురం స్మశానవాటికను చరిత్రలో నిలిచిపోయే విధంగా అందమైన, సుందరమైన అన్ని వసతులతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అల్లీపురం గ్రామ సమస్యలను అన్నింటినీ నూటికినూరు శాతం పరిష్కరిస్తానని చెప్పారు. అల్లీపురం అభివృద్ధి పనులకు కావలసిన నివేదికలు తయారుచేయండని, అధికారులను ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here