సమన్వయంతో సమస్యలను సాధించవచ్చు

0
63

ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడమే మేలని నెహ్రూ యువకేంద్ర డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ ఆకుల మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో గురువారం ఉదయం బుచ్చిరెడ్డిపాలెంలోని గుత్తికొండ శ్రీరాములు డిగ్రీ కాలేజీ నందు బుచ్చిరెడ్డిపాలెం బ్లాక్ స్థాయి “క్లబ్ డెవలప్మెంట్ కన్వెన్షన్” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ గ్రామీణ యువ నాయకులు తమను తాము వ్యక్తీకరించడానికి, అనుభవాలను పంచుకునేందుకు మరియు యూత్ క్లబ్ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి, యువత సాధికారత కోసం ఉత్తమ అభ్యాస కార్యక్రమాలను సూచించడానికి ఎంతో దోహదపడతాయని తెలియజేశారు. మండల ప్రజా పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ బి వి నరసింహారావు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కొత్త యువజన సంఘాలు ఏర్పాటు చేయడం కోసం, సమాజంలోని అన్ని సెక్షన్ల నుండి ప్రాతినిధ్యంతో యూత్ క్లబ్ యొక్క ప్రస్తుత నెట్వర్క్ను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. నిద్రాణమైన యూత్ క్లబ్ లను సక్రమం చేయడానికి, కొత్త క్లబ్లను ఏర్పాటు చేసి ఆ జిల్లాలోని అన్ని వర్గాల ప్రాతినిధ్యంతో ముందుకుసాగే దిశగా పయనించాలని కోరారు. ముందుగా యువతకు ఆదర్శప్రాయమైన స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్కూలు ప్రిన్సిపాల్ ఏ వీ చిరంజీవి, మండల డిప్యూటీ తహశీల్దారు బి. తులసీమాల, పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్ రాజు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ విద్యాసాగర్, మండలంలోని యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here