దోమల నివారణకు కాలువల్లో ఆయిల్ బాల్స్ – ఎస్ఆర్ ఇంతియాజ్

0
109

నెల్లూరు, నవంబర్‌ 29 : నెల్లూరు నగరంలో 42వ డివిజన్ కోటమిట్ట, విరాట్ నగర్, హుస్సేనీనగర్, అమీన నగర్ ప్రాంతాలలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా|| పి.అనీల్ కుమార్ సూచనల మేరకు ఆ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ఎస్ఆర్.ఇంతియాజ్ ఆధ్వర్యంలో దోమల నిర్మూలనకు కాలువల్లో, మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేశారు.ఈ సందర్భంగా ఎస్ఆర్. ఇంతియాజ్ మాట్లాడుతూ మంత్రి డా|| పి.అనీల్ కుమార్ సూచనల మేరకు 42వ డివిజన్ ప్రాంతంలో కాలువల్లో, మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమల నివారణకు ఆయిల్ బాల్ట్ వేయడం జరిగిందని, అలాగే ఫాగింగ్ కూడ చేయడం జరుగుతుందన్నారు. ప్రతిరోజూ ఒక్కో ప్రాంతంలో ఆయిల్ బాల్స్ వేసి, ఫాగింగ్ చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్నీ వర్గాలకు న్యాయం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ సిపి మైనారిటీ నాయకులు సయ్యద్ సమీహుస్సేనీ, హంజాహుస్సేనీ, మునీర్ సిద్ధిక్, సయ్యద్ అలీం గోల్డ్, సయ్యద్ రషీద్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here