తాసిల్దారు విజయ రెడ్డి సజీవదహనం పై ఎన్జీవోలు నిరసన

0
72

నెల్లూరు, నవంబర్‌ 07 : తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం గావించడం, అత్యంత దారుణమనియి, ఇది ఆటవిక చర్య అని, పట్టపగలే ఆఫీసులో పెట్రోల్ పోసి నిప్పు తహసీల్దార్ ను హత్య చేయడం ప్రజాస్వామ్యంలో హేయమైన చర్యగా ఎన్జీవోలు అభిప్రాయపడ్డారు. ఇటువంటి సంఘటనలను ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నెల్లూరు జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తున్నారు, కాపాడే ప్రయత్నంలో డ్రైవర్ 70 శాతం పైగా కాలిపోయి డ్రైవర్ గురునాథం కూడా మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షులు సీ హెచ్ వీ ఆర్ సీ శేఖర్ రావు ఆధ్వర్యంలో నెల్లూరు ఏపీఎన్జీవో భవనంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటీవల కాలంలో ఇటీవల కాలంలోఏపీ ఎన్జీవో అసోసియేషన్ నాయకులు ఆరోపణలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని, గతంలో ఇదే ఏపీ ఎన్జీవో అసోసియేషన్ లో పనిచేసిన వ్యక్తులు కొత్తగా వచ్చిన అసోసియేషన్ లో చేరి ఎన్జీవో అసోసియేషన్ విధి విధానాలు నచ్చలేదని చెప్పడం హాస్యాస్పదమని వారు పేర్కొన్నారు. ఏ అసోసియేషన్ అయినా ఉద్యోగులసంక్షేమం కోసమే పనిచేయాలని,ఒకరినొకరు విమర్శలు చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు. ఎంతో చరిత్ర కలిగిన ఏపీఎన్జీవో అసోసియేషన్ తక్కువ చేసి మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని జిల్లా అద్యక్ష, కార్యదర్శులు ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఈ నిరసన కకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నందిమండలం ఆంజనేయ వర్మ, అసోసియేట్ ప్రెసిడెంట్ యన్.గిరిధర్, కోశాధికారి బండారుపల్లి వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మన్నేపల్లి పెంచలరావు, ఉపాధ్యక్షులు యం.వి సువర్ణ కుమారి, గొలగమూడి, రమేష్ బాబు, లక్కాకుల, పెంచలయ్య ,కడెం. రాజేంద్రప్రసాద్, నల్లగొండ్ల మధు, సంయుక్త కార్యదర్శులు ఈదూరు.విజయకుమార్, నాయుడు. వెంకటస్వామి, జి.మాధవయ్య, ఈదూరు కరుణమ్మ, నెల్లూరు నగర అద్యక్షుడు జి.రామకృష్ణ, రాపూరు,పొదలకూరు కార్యదర్శులు మల్లి ఖార్జున,మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here