కోడి పందేలాటలపై ముత్తుకూరు పోలీసులు దాడులు

0
38

ముత్తుకూరు, జనవరి 13 : సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో దొంగ చాటుగా జరిగే కోడి పందేలు, పేకాటలు నివారించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులుకు జిల్లా ఎస్పీ ఇచ్చిన అదేశాలు మేరకు సోమవారం సాయంత్రం ముత్తుకూరు మండలం, పోలంరాజుగుంట ఉలసవాగు వద్ద, నెల్లూరు రూరల్ డిఎస్పి సూచనలు మేరకు, కెపి. పోర్ట్ సిఐ ఆధ్వర్యంలో ముత్తుకూరు, పోర్ట్ ఎస్సై వారి సిబ్బంది కోడి పందేల స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించడం జరిగింది. పక్కా సమాచారం మరియు పగఢ్భందిగా ఈ దాడిని నిర్యాహించి మొత్తం 41మంది జూదరులను పట్టుకుని వారి వద్ద నుండి రూ.38,000, ఒక ఆటో, 70 బైకులు, 17 సెల్ ఫోన్లు, 9 కోడి పుంజులను స్యాధీనం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here