వామపక్ష విద్యార్థి సంఘాలను రద్దు చేయాలి

0
38

నెల్లూరు, జనవరి 11 : శనివారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సర్కిల్ దగ్గర జేఎన్‌యు లో విద్యార్థుల పై దాడికి పాల్పడ్డ వామపక్ష విద్యార్థి సంఘాల దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కోకన్వీనర్ రాజశేఖర్ మాట్లాడుతూ జేఎన్‌యు లో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు వామపక్ష విద్యార్థి సంఘాలని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిజానిజాలు తేల్చారని తెలిపారు. జేఎన్‌యుఎస్‌యు ప్రెసిడెంట్ ఆయేషా ఘోష్ ఈ దాడిని ముందుండి నడిపారని ఇలాంటి విచక్షణా రహితమైన హింసను పెంచి పోషిస్తున్న కమ్యూనిస్టులు తమ ఉనికిని కాపాడుకునేందుకు చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికే వామపక్ష విద్యార్థి సంఘాలు రెండు యూనివర్సిటీలకు పరిమితం అయ్యాయని ఇకముందు దేశం నుండే తరిమి కొడదామని హెచ్చరించారు. వీరు కమ్యూనిస్టులు కాదు కంపునిస్టులు అని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.మీ పరాయి దేశ సంస్కృతి సంప్రదాయాలను భారతదేశంలో తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నాలను ఏబీవీపీ అడ్డుకుంటుందని హెచ్చరించారు. కొందరు వామపక్ష విద్యార్థి నాయకులు మేము భారతీయులం అని చెప్పుకుంటున్నారు మీరు నిజమైన భారతీయులు అయితే భారత్ మాతాకీ జై వందేమాతరం పాడాలన్నారు.జేఎన్యు లో జరిగిన దాడి పై పోలీసులు తగిన చర్యలు తీసుకుని ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసు శాఖను డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి జస్వంత్, జయంత్, లక్ష్మణ్, సాయికృష్ణ, యశ్వంత్, మహేష్, భాను, శ్రీకాంత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here