వైకాపాలో చేరిన కోడూరు కమలాకర్ రెడ్డి

0
158

నెల్లూరు, సెప్టెంబర్‌ 21 : నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి కుడిభుజం కోడూరు కమలాకర్ రెడ్డి 4వేల మంది కార్యకర్తలతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి
శ్రీధర్ రెడ్డి సమక్షంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కోడూరు కమలాకర్ రెడ్డి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరే సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ పరిసర ప్రాంతాలు జెన సంద్రంగా మారాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో జీవితకాలం కోడూరుపాడు అభివృద్ధికి కృషిచేస్తా నని ఈ సందర్భంగాకోడూరు కమలాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కొండ్రెడ్డి రంగా రెడ్డి, వై.వి. రామి రెడ్డి, రూప్ కుమార్ యాదవ్, తాటి వెంకటేశ్వర రావు, బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, మిద్దె మురళీ కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here