జర్నలిస్టు కాలనీకి నా పేరు వద్దు…జాతీయ నాయకుల పేర్లు పెట్టండి

0
106

– రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు, డిసెంబర్‌ 02 : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరులో 25 లక్షల రూపాయల వ్యవయంతో జర్నలిస్టు కాలనీ రోడ్డు పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిశంఖుస్థాపన చేశారు.ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ 31, 32 డివిజన్లలో అభివృద్ధి పనులకు ఇప్పటికే 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. కొత్తూరు జర్నలిస్టు కాలనీకి నా పేరు వద్ద జాతీయ నాయకుల పేర్లు పెట్టండని అన్నారు. ఎందరో ప్రముఖులున్నారని, పత్రికా రంగంలో రాణించిన వారు ఉన్నారని, ఆలాగే దివంగత మహానేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి పేరు కూడా పెట్టాలన్నారు. తన పేరు జర్నలిస్టు కాలనీకి వద్దని, నా మీద అభిమానంతో జర్నలిస్టు కాలనీకి తన పేరు పెట్టాలని సూచించిన జర్నలిస్టు సోదరులందరికి ఋణపడి ఉంటానన్నారు. అతి తక్కువ కాలంలో కొత్తూరు శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు కొత్తూరు చక్కటి వేధిక కాబోతుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. తగాదాలు లేకుండా మంచికి మారు పేరుగా కొత్తూరు నిలుస్తుందని అన్నారు. ఇక్కడ స్థలాలు తక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లల చదువులకోసం నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొత్తూరు ప్రాంతానికి వలసలు వస్తున్నారన్నారు. వచ్చే సంవత్సరం మార్చి, ఏప్రిల్ లో కొత్తూరు అభివృద్ధికి 5 కోట్ల నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here