సమస్యల పరిష్కారంపై దూకుడు పెంచండి

0
175

జిల్లా కలెక్టర్ ని, కమీషనర్ ని కలసిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నెల్లూరు, అక్టోబర్‌ 22: మంగళవారం జిల్లా కలెక్టర్ ని, నెల్లూరు నగరపాలసంస్థ కమీషనర్ ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పలు సమస్యలపై భారీ వర్షాలతో శివారు కాలనీలలో నివశిస్తున్న ప్రజల పరిస్థితులపై జిల్లా కలెక్టర్, కమీషనర్ కి సమస్యలు వివరించారు.రూరల్ కార్యాలయం ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, ఆటోనగర్ లోని పలు సమస్యలపై, నరసింహకొండ దేవస్థానం అభివృద్ధి విషయం, శిల్పారామం అభివృద్ధి, ఆమంచర్ల స్పోర్ట్స్ కాంప్లెక్స్, కార్పోరేషన్లోని శానిటేషన్ విభాగంపై, వీధిలైట్ల సమస్యలపై, ఫాగింగ్ మెషీన్లపై, ఆయిల్ బాల్స్ భారీ వర్షాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి వీటిపై చొరవ తీసుకోవాలన్నారు. నెల్లూరు నగర పాలకసంస్థ కమీషనర్ తో భారీ వర్షాలు కురుస్తున్నాయని, శివారు కాలనీలలో కనీసం నడిచే పరిస్థితి కూడా లేదని, యుద్ధప్రాతిపధికన అధికారులను శివారు కాలనీలకు పంపించి, పరిస్థితిని సమీక్షించాలన్నారు. అధికారులు డివిజన్లలో వెళ్ళిన తరువాత రూరల్ ఎమ్.ఎల్.ఎ. కార్యాలయం ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కమీషనర్ ఛాంబర్ నుంచి వెళ్ళారు.అధికారులను అప్రమత్తం చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డినెల్లూరులో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులుపడకుండా చూడాలని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి మరియు అధికారులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజయవాడనుంచి ఫోన్ లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ, అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బల శ్రీనివాస యాదవ్, ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, పిండి సురేష్, కోడూరు కమలాకర్ రెడ్డి, మిద్దె మురళీ కృష్ణ యాదవ్, అబ్దుల్ సలీమ్, బూడిద పురుషోత్తం యాదవ్, బర్నాబాస్, సునీల్ రెడ్డి, శివయ్య నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here