అత్యాచారాలు, హత్యలకు వ్యతిరేకంగా నెల్లూరులో భారీ ర్యాలీ

0
94

నెల్లూరు, డిసెంబర్‌ 15 : దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు హత్యలకు వ్యతిరేకంగా స్త్రీ విముక్తి సంఘటన ఆధ్వర్యంలో ఆదివారం విఆర్సి గ్రౌండ్ నుంచి నెహ్రూబొమ్మ చిన్నబజారు పెద్ద బజారు పై నుంచి తిరిగి విఆర్సి గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.క్రీడాకారులు విద్యార్థిని విద్యార్థులు వాకర్స్ రచయితలు సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎన్కౌంటర్లు జరిగినా శిక్షలు పడ్డ అత్యాచారాలు తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పాశ్చాత్య నాగరికత టీవీలు సెల్ఫోన్ల వల్ల యువతలో నేరప్రవృత్తి పెరుగుతోందని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులను తమ పిల్లలను మంచి మార్గంలో పెట్టవలసిన అవసరం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో కొండమ్మ దీప్తి భాస్కర్ రెడ్డి జయప్రకాష్ సుభద్రాదేవి శ్రీధర్ బాబు ఆచార్య ఆదిత్య ఇతరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here