అట్టహాసంగా ఎంపీ ఆదాల జన్మదినోత్సవం

0
116

నెల్లూరు, అక్టోబర్‌ 25 :నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి జన్మదినోత్సవం శుక్రవారం ఉదయం ఆయన ఇంట్లో అట్టహాసంగా జరిగింది. ఉదయాన్నే ఆదాల ప్రభాకర్ రెడ్డి వింధ్యావళి దంపతులు వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. పలువురు నేతలు కార్యకర్తలు అభిమానులు ఉదయం నుంచే ఆయన ఇంటికి అభినందించేందుకు బారులు తీరారు. ఏపీ ఆర్ జిందాబాద్ ఏపీ ఆర్ వర్ధిల్లాలి అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. భారీ గజమాలలతో సత్కరించారు డప్పులు మోత మోగాయి. బాణాసంచా శబ్దాలతో ప్రాంతమంతా హోరెత్తింది. పలువురు కార్యకర్తలు, నేతలు శాలువాలతో సత్కరించారు పూలమాలలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆ తర్వాత అభిమానుల మధ్య ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి భారీ కేకును కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. ప్రాంతాలకతీతంగా పార్టీలకతీతంగా ఆయన అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా ఆయన అభిమానులు ఇంటికి ఇరువైపులా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఆదాల అభిమాని నిజాముద్దీన్ హైదరాబాదు నుంచి భారీ బెలూన్ను తెప్పించి గురువారం రాత్రి ఆయన ఇంటి పైన ఎగరవేశారు తన అభిమానాన్ని ఆకాశమంత ఎత్తులో చూపించుకున్నారు. భారీ సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులకు కు అల్పాహారం మిఠాయిలు పంపిణీ జరిగింది ఆదాల ప్రభాకర్ రెడ్డి జన్మదినోత్సవ ఏర్పాట్లు విజయ డైరీ చైర్మన్ రంగా రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here