ఘనంగా జెకె రెడ్డి జన్మదిన వేడుకలు

0
37

నెల్లూరు, డిసెంబర్‌ 23 : నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్ నందు గల మాజీ ఎమ్మెల్యే జెకె రెడ్డి నివాసం నందు జెకె రెడ్డి 79 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నెల్లూరు నగరంలోని ప్రముఖులు ఆయన నివాసానికి విచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అమీర్ జాన్, దోర్నాల హరిబాబు, హరినాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here