డివిజన్ స్థాయి యువజనోత్సవాలను ప్రారంభించిన గిరిధర్‌రెడ్డి

0
106

నెల్లూరు, నవంబర్‌ 16 : నెల్లూరు నగరంలోని డికెడబ్ల్యు కాళాశాలలో డివిజన్ స్థాయి యువజనోత్సవాలను రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్యం యువతకు అన్ని రంగాలలో ముందుండే విధంగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. స్వామి వివేకానందని విద్యారులందరు ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని సూచించారు. నేడు క్రీడా విధానంలో విద్యార్థులంతా డివిజన్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి వెళ్లి మంచి ప్రతిభను చూపాలని అదేవిధంగా విద్యార్థులందరూ కూడా చదువుకే బానిసలు కాకుండా మైదానంలో ఆటలు ఆడుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఉండాలని తెలియజేశారు. వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి బిరుదవోలు శ్రీకాంత్ రెడ్డి, సి.ఇ.ఓ. సుస్మిత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here