స్కూలు విద్యార్ధినులకు ప్రభుత్వంచే ఉచిత కరాటే శిక్షణ

0
178

నెల్లూరు, అక్టోబర్‌ 05 : నెల్లూరు నగరంలోని స్థానిక వేదాయపాళెం నందు రుద్రమదేవి సెల్ఫ్‌ డిఫెన్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ అండ్‌ యోగా ట్రైనింగ్‌ సెంటర్‌ నందు నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆ సంస్థ డైరెక్టర్‌ వి.రవి మాట్లాడుతూ ప్రభుత్వం చే ఆర్‌ఎమ్‌ఎస్‌ ద్వారా జిల్లాలోని 361 ప్రభుత్వ స్కూళ్ల నందు 26 జూనియర్‌ కాలేజీల నందు ఈ నెల 12వ తారీఖు నుండి 90రోజుల పాటు బాలికలకు కరాటేలో శిక్షణ ఇవ్వబడుతుందని తెలియజేశారు. ఒక నెలలో 10తరగతులు నిర్వహించి 3నెలల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలోని విద్యార్థినిలు శిక్షణ పొంది సెల్ఫ్‌ డిఫెన్స్‌ నందు తర్ఫీదు పొందవలసినదిగా తెలియజేశారు. ఇది ప్రభుత్వం చే ఉచితంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ ఎన్‌.లక్ష్మీ సామ్రాజ్యం, టి.వసంతకుమార్‌, భరధ్వాజ్‌, వి.ఆదినారాయణ, అరవ పూర్ణ ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here