ప్రశాంతంగా ముగిసిన రొట్టెల పండుగ ఉత్సవాలు

0
87

ఐదవ రోజు కూడా నగరం మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల వాసులతో కొనసాగిన రద్దీ
37 మంది తప్పిపోయిన చిన్నారులను తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసు కంట్రోల్ రూం
ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ముగిసిన ఐదవ రోజు ఉత్సవాలు
నెల్లూరు, సెప్టెంబర్‌ 14 : నెల్లూరు నగరంలోని బారాషాహీద్ దర్గా మరియు స్వర్ణాల చెరువులో అట్టహాసంగా జరుగుతున్న రొట్టెల పండుగ ఐదవ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా కొనసాగింది. ఈ రోజు కూడా పోలీసు సేవాదళ్ సభ్యులు 37 మంది తప్పిపోయిన చిన్నారులను తల్లిదండ్రుల చెంతకు చేర్చడం జరిగింది. వృద్ధులకు, దివ్యాంగులకు దర్గా దర్శనం మరియు రొట్టెల మార్పిడికి వీల్ చైర్స్ మొదలగు ఉపకరణాల సహాయంతో కమ్యునిటీ పోలీసింగ్ సెక్టార్ లోని సభ్యులు ఇంకా వారి సేవలు కొనసాగిస్తూనే ఉన్నారు.దక్షిణ భారతదేశంలోని తీర ప్రాంతాల ద్వారా వచ్చిన భారత భూ భాగంలోనికి ఉగ్రవాదులు చొరబడవచ్చు అన్న కేంద్ర నిఘా సంస్థల సమాచారంతో, భక్తులు మరియు సందర్శకులు భద్రతను దృష్టిలో పెట్టుకొని బాంబ్ డిస్పోసల్ టీం లు, డాగ్ స్క్వాడ్ లు దర్గా ఆవరణంలో, ఘట్ ల వద్ద, షాపింగ్ మరియు క్యూ లైన్ లలో ఇంకా మూల మూలన తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.లక్షల మంది భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేయబడ్డ పోలీసు కమాండ్ కంట్రోల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పి.టి.జెడ్., సి.సి. డ్రోన్ కెమెరాల నిఘాలో ప్రధాన దర్గా క్యూ లైన్లు, ఘాట్ ఏరియా, బోటింగ్ పాయింట్, పార్కింగ్ మరియు ట్రాఫిక్ పాయింట్ లను సమన్వయ పరుస్తూ, అన్ని సెక్టార్ లలోని భక్తుల తాకిడిని పద్ధతి ప్రకారం నియంత్రణలో ఉంచుతూ సమర్ధవంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అపసృతులకు తావులేకుండా రొట్టెల పండుగ బందోబస్తే ఇప్పటివరకు విజయవంతంగా నిర్వహించడం జరిగింది అని జిల్లా యస్పి ఐశ్వర్య రస్తోగి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here