కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన

0
52

నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఒకటవ డివిజన్ గమళ్ళ పాలేంలో 45 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్చార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మున్సిపల్ కమిషనర్ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి 145 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అనేక పధకాలు ప్రవేశపెడుతూ, ప్రజల సుఖసంతోషాలు కోరుకుంటున్న నాయకుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు సహాయసహకారాలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి, ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here