కిరాక్‌ ఆర్పి చే నెల్లూరులో ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఏర్పాటు

0
119

నెల్లూరు, సెప్టెంబర్‌ 20 : నెల్లూరు నగరంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జబర్దస్త్‌ నటుడు కిరాక్‌ ఆర్పీ తన ఆధ్వర్యంలో ఈ నెల 22వ తారీఖున బొల్లినేని హాస్పిటల్‌ ఎదురుగా కిరాక్‌ ఆర్పీ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్ధను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా 25 కళాసంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరీయుడు అయిన కిరాక్‌ ఆర్పీ చే ప్రారంభించబడే ఈ సంస్ధను నెల్లూరు జిల్లాలోని వారందరూ సద్వినియోగం చేసుకోవాలని మన నెల్లూరీయుడుని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమ్మా ఫర్నిఛర్‌ అధినేత గడ్డం సుధాకర్‌రెడ్డి, నేదుమల్లి హరనాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here