ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన జిల్లా జాయింట్ కలెక్టర్

0
34

నెల్లూరు డిసిఎమ్‌ఎస్‌ ఛైర్మన్ వీరి చలపతిరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి.,పలు అభివృద్ధి పనులకు జిల్లా జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, అధికారులు శంకుస్థాపన చేసారు. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నార్తురాజుపాళెం పద్మనాభసత్రం గ్రామాలలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి.,నార్తు రాజుపాళెం గ్రామంలో 1-కోటి రూపాయలతో నిర్మించనున్న మూతబండ కాలువలు (సైడు కాలువలు) నిర్మాణానికి, మిక్కిలింపేట గ్రామంలో 40-లక్షలతో గ్రామ సచివాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్, డిసిఎమ్ఎస్ ఛైర్మన్ వీరి చలపతిరావు వ్యవసాయ శాఖ,సివిల్ సప్లైస్ జిల్లా అధికారులు, మండల అధికారులు, నాయకులు, ప్రజలు, రైతులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here