లోపభూయిష్టంగా ఉన్న ఇసుక, మధ్యం పాలసీలు సరిదిద్దాలి – ఏవిఆర్‌

0
74

నెల్లూరు, అక్టోబర్‌ 10 : నెల్లూరు నగరంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత
ప్రభుత్వం తీసుకున్న ఇసుక, మధ్యం పాలసీలు లోపభూయిష్టంగా ఉన్నాయని అవి సరిదిద్దకపోతే తెలుగుదేశం పార్టీ ఇసుక పాలసీ మీద తీసుకున్న ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకుని మధ్యం పాలసీ మీద కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పిట్టి సత్యనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here