దేవాదాయశాఖ భూములు విక్రయ ఉత్తర్వులు రద్దు చేయాలి

0
119

నెల్లూరు, నవంబర్‌ 20 : రాష్ట్రప్రభుత్వం దేవాదాయశాఖ పరిధిలోని భూములను విక్రయించి ఆదాయం సమకూర్చుకుంటామనే జిఓ ను రద్దు చేయ్యాలని డిమాండ్‌ చేస్తున్నట్లు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిడతల రమేష్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయ భూములను ఆలయాలను ఆర్ధికవనరులుగా భావించడం హిందూ ధర్మం పై దాడిగా భావిస్తున్నామన్నారు. ఒక్క నెల్లూరు జిల్లాలో 1309 ఆలయాలను, అందులో 222 ఆలయాలు ఆర్దికవనరులు కలిగిన ఆలయాలుగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. జిల్లాలో 27000 ఎకరాల ఆలయభూములను దేవాలయాల పరిధిలోనే వుంచాలని,లీజులు వసూలుకు కఠినమైన నిర్ణయాలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. అన్యమతులెవరైనా తిరుమల స్వామి దర్శనం కొరకు డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నామని తెలిపారు.రాష్టరపౌరసరఫరాల మంత్రి కొడాలి నాని, సిఎమ్‌ జగన్‌ తిరుమల ఆలయ దర్శనం పై వాడినభాష, రాజకీయస్వార్ధం కోసం ధర్మం పై దాడి చేశారు. అన్యమతస్తుల తిరుమల దర్శనం పై డిక్లరేషన్‌ను వ్యతిరేకించి హిందూసాంప్రదాయాలను అగౌరపరిచారు. రాష్ట్రంలో బాధ్యత కలిగిన మంత్రి హోదాలో వుండి వాడిన పరుషపదజాలం పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. అనంతరం బిజెపి జిల్లా కార్యదర్శి కాసా శ్రీనివాసులు మాట్లాడుతూ జొన్నవాడ కామక్షమ్మ ఆలయంలో భక్తులు వెలిగించిన దీపాలపై నీరుపోసి ఆర్పిన ఘటన పై ఉన్నతస్థాయి విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి శేషారెడ్డిని తొలగించడం మాకు సంతృప్తికరంగా లేదు దీపాలను ఎవరు చెబితే నీరు వదిలారో అనే అంశం పై దర్యాప్తు జరపాలని కోరుతున్నామన్నారు. ఈ సంఘటనను బిజెపి తీవ్రంగా పరిగణిస్తుంద్నారు. జొన్నవాడ ఆలయ పరిసరాలలో మందుబాటిల్లు, అసభ్యకరమైన వ్యర్దాలు, పారిశుద్యలోపం, అసాంఘీక కార్యక్రమాలు దర్శనమిస్తున్నాయి. ఆలయఅధికారులు బాద్యతరాహిత్యం పై దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భీమన శ్యాంబాబు, ఓజిలి సుధాకర్‌, నరాల సుబ్బారెడ్డి, పూజారి రామకృష్ణ, మువ్వల రాంబాబు, ఎన్‌,శర్మ, రామిశెట్టిమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here