ఓటరు నమోదుకు సహకరించండి – కమిషనర్ పివివిస్ మూర్తి

0
87

నెల్లూరు, అక్టోబర్‌ 10 : భారత ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం -117 లో జరుగుతున్న డోర్ టు డోర్ సర్వేలో ప్రజలు సరైన వివరాలు అందించి ఓటరు నమోదుకు సహకరించాలని నగర పాలక సంస్థ కమిషనర్ పివివిస్ మూర్తి ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. ఓటరు లిస్టులో నూతనంగా పేరు నమోదు, పేరు సవరణలతో పాటు కుటుంబంలో మరణించిన వ్యక్తి ఓటు
తొలగింపు కూడా బూత్ లెవలింగ్ అధికారులు చేస్తారని, ఆధార్ లేక రేషన్ కార్డు జెరాక్స్ పత్రాలను వారికి అందించి సహకరించాలని కోరారు. అక్టోబర్ 15వ తేదీ వరకు జరిగే ఇంటింటి సర్వేను ప్రజలంతా సద్వినియోగం చేసుకుని 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటరుగా నమోదు చేయాలని కమిషనర్ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here