సర్టిఫికేట్ల పరిశీలనకు అన్ని ఏర్పాట్లు పూర్తి

0
183

– సర్వోదయా, సెయింట్ జోసెఫ్ స్కూల్లలో కేంద్రాలు

– కమిషనర్ పివివిఎస్ మూర్తి

నెల్లూరు, సెప్టెంబర్‌ 23: వార్డు సచివాలయ కార్యదర్శుల పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్థుల నియామకాలకు సంబంధించి సర్టిఫికేట్ల పరిశీలన కార్యక్రమం మంగళవారం నుంచి చేపట్టనున్నామని, నగరంలోని సర్వోదయ కళాశాల, సెయింట్ జోసెఫ్ స్కూళ్ళు కేంద్రాలుగా ఏర్పాట్లు చేశామని నగర పాలక సంస్థ కమిషనర్ పివివిఎస్ మూర్తి ప్రకటించారు. ఏర్పాట్ల నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నాలుగు విభాగాల్లో అర్హత సాధించిన 548 అభ్యర్థులకు చెందిన సర్టిఫికేట్ల పరిశీలన అధికారులు తొలిరోజు చేస్తున్నారని, కేంద్రాల సమాచారం అభ్యర్థులకు మెసేజ్, మెయిల్ ద్వారా పంపించామని తెలిపారు. సర్టిఫికేట్ల పరిశీలనకు వచ్చే అభ్యర్థులు జనన ధ్రువీకరణ, విద్యార్హతలు, కుల ధ్రువీకరణ ఇతర ఒరిజినల్ పత్రాలతో పాటు జెరాక్స్ కాపీలు, ఫోటోలు తప్పక తీసుకురావాలని సూచించారు. వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డ్ ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెస్సింగ్ సెక్రటరీ, వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రెటరీ విభాగాలకు ఎంపిక అయిన అభ్యర్థులు సూచించిన ఆయా కేంద్రాల్లో అధికారులను సంప్రదించాలని కమిషనర్ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here