వసతుల పరిశీలనలో కమిషనర్

0
70

నెల్లూరు, అక్టోబర్‌ 23,: వార్డు సచివాలయ కార్యదర్శుల రెండవ బృందానికి శిక్షణలో అందుతున్న వసతులను నగర పాలక సంస్థ కమిషనర్ పివివిస్ మూర్తి బుధవారం పరిశీలించారు. కొడవలూరు మండలం రామన్న పాలెంలోని ఆదిశంకరా ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న శిక్షణా తరగతులను ఆయన పర్యవేక్షించి అభ్యర్థులతో మాట్లాడారు. నాణ్యమైన భోజన వసతులు కల్పించడంతో పాటు మహిళా అభ్యర్థుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని కమిషనర్ స్పష్టం చేసారు. అన్ని బృందాలకు శిక్షణా సమయంలో చక్కటి వసతులు, సౌకర్యవంతమైన ఏర్పాట్లను నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో అందిస్తున్నామని, అభ్యర్థులు శిక్షణలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని కమిషనర్ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here