నవంబర్‌ 3న “ఛలో వైజాగ్‌”

0
131

నెల్లూరు, అక్టోబర్‌ 25 ‌: శుక్రవారం జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి,స్టేట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు చెన్నారెడ్డి మనుక్రాంత్ మాట్లాడుతూ రాష్ట్ర బాద్యతో పాటు అదనంగా జిల్లా పార్లమెంటరీ బాధ్యతలు అప్పగించిన పవన్ కల్యాణ్ కి ధన్యవాదాలు తెలిపారు.జిల్లాలో సిటీ,రూరల్ ,కోవూరు,నియోజక వర్గాల్లో ఇంచార్జి లను ఏర్పాటు చెసెవరకూ తానే ఆ నియోజకవర్గాలను సమీక్షించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ఇసుక విధానాల వలన ఉపాధి కోల్పోతున్న కార్మికులకు అండగా పవన్ కళ్యాణ్ మన పార్టీ ఛలో వైజాగ్ అని నవంబర్ 3న పిలుపునిచ్చారన్నారు. ఎందుకంటే ఇపుడు ఉన్న వైఎస్సార్‌ ప్రభుత్వం అవగాహనలేని నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలమంది సామాన్యప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు కనీసం 30 లక్షల మంది రోడ్ల మీద పడుతున్నారు. వాళ్లంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో వారికీ రోజు కూలీలు రాక, ఉపాధి లేకుండా రోడ్ల మీద పడుతున్నారు.వాళ్లే కాకుండా ఇసుకని తరలించే వాళ్లు ట్రాన్స్ పోర్టర్లు కానీయండి ట్రక్ ,ట్రాక్టర్లు లీజ్ కి తీసుకొని లీజ్ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు కూడ ఉన్నారు.అదేవిధంగా మధ్య తరగతి వాళ్ళు ఇల్లు కట్టుకోడానికి ఎంతో కష్టంగా ఉంది కాస్ట్ ఎస్కేలేషన్ ఎక్కువ అయిపోయింది వీలందరికి భరోసా ఇవ్వడం కోసం విధానాలలో ఏదొక మార్పు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఛలో వైజాగ్ అని చెప్పి నవంబర్ 3న అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు. వైస్సార్సీపీ కార్యాలయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒప్పుకున్నారు సాండ్ పాలసీ వలన ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, కొందరు అధికారుల వల్ల అని అధికారుల లేదా వైస్సార్సీపీ నాయకుల అని తప్పకుండా వివరణ ఇవ్వాల్సింది. ఎందుకంటే అధికారం లో ఉండేది మీ పార్టీనే అధికార ఎమ్మెల్యే కూడా మీరే ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరే భాధ్యత వహించాలి, మీరు ఒప్పుకోవాలి మీరు ఫెయిల్ అయ్యారని చెప్పి, మీరు ప్రతక్షంగా యుద్ధం చేస్తానని చెప్తున్నారు ఎవరిమీద చేస్తారు జగన్ మోహన్ రెడ్డి మీద చేస్తారా..? అనే క్లారిటీ ఇవ్వాలి . మీరు కనుక నిస్వార్ధంగా లేకుంతే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజలందరికీ క్షమాపణ చెప్పినట్టు ఐతే మేము కూడా మీకు మధ్దతు ఇస్తాం అంతేకాని ఎదో కంటితుడుపు చర్యలాగా ఇసుక అక్రమాలు జరుగుతున్నాయి అని అంటే సరికాదు ఇసుకలో కచ్చితంగా అక్రమాలు జరుగుతున్నాయి సామాన్య ప్రజలికి ఇసుక దొరకడం లేదు కానీ రాత్రులు పూట ట్రక్కులకి ట్రక్కులు ఇసక చెన్నైకి కానీ బెంగుళూరుకి అక్రమంగా లక్ష రూపాయలకి ట్రక్ చొప్పున తరలిస్తున్నారు అనిఆరోపణలు ఉన్నాయి జరుగుతున్న వాస్తవాలకి ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. దీని మీద కూడా నెల్లూరు రురల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తప్పకుండా సమాధానం చెప్పాలన్నారు.అదేవిధంగా చూస్తే ఈ వారం అంత కూడా వర్షాలు తీవ్రంగా ఉన్నాయి , భారీ వర్షాల వల్ల ఈ మురికి కాల్వల అన్ని పొంగిపొర్లుతున్నాయి దానివల్ల ఆ నీళ్లు కొన్ని చోట్ల ఇళ్లల్లోకి వస్తున్నాయి ప్రజలు కూడా తీవ్రఇబ్బంది పడుతున్నారు తప్పకుండా దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి.పోయిన సారి మీరు ప్రతిపక్షం లో ఉన్నాం ఏమి చేయలేకపోతున్నాం అని చెప్పారు కానీ ఇపుడు ప్రభుత్వం మీదే ఉంది అధికార ఎమ్మెల్యే మీరే ఉన్నారు కాబట్టి తప్పకుండా చర్యలు తీసుకుని ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా చూడాలని, అదేవిధంగా నెల్లూరులో చాలావరకు విషజ్వరాలు ఎక్కువగా ఉంది వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలన్నారు. మనం చూస్తే లిక్కర్ పాలసీ అని ప్రభుత్వం తీసుకొచ్చారు కానీ అసలు మద్యపానం నిషేధం అంటే మద్యపానం అంచెలంచెలుగా తీసేస్తాం అంటున్నారు కానీ మద్యం రేట్లు విపరీతంగా పెంచేసి డబ్బులు ఎక్కువ పెట్టి కొనాల్సివస్తున్నది అని చెప్తున్నారు అది బ్లాక్ మార్కెట్ లో అప్పులైపోతున్నారు అని వాళ్ళింట్లో పిల్లలు , భార్యలు, తల్లులు రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని వెనకాల కూడా వైస్సార్సీపీ నాయకుల హస్తం ఉందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.దీని మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ని బలోపేతం చేసుకొని గ్రామా స్థాయి నుంచి జిల్లా స్థాయివరకు బలోపేతం చేసుకుంటాము.మిగతా ముగ్గురు అభ్యర్థులను కూడా మన నెల్లూరు పార్లమెంట్ నియోజగవర్గం పరిధిలో ఉన్న నెల్లూరు రురల్, నెల్లూరు సిటీ, కోవూరు సంభందించిన వాళ్ళని కూడా త్వరలో కరెక్ట్ నాయకులని నియమించి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటిస్తాం అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మనుక్రాంత్ తో పాటు ఆత్మకూరు ఇన్‌ఛార్జ్ నలిసెట్టి శ్రీదర్, కిశోర్ గునుకుల, కృష్ణారెడ్డి, శ్యామ్, ప్రవీణ్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here