వచ్చే ఏడాది నుంచే కావలిలో కేంద్రీయ విద్యాలయం

0
66

నెల్లూరు ఎంపీ ఆదాలకు కేంద్ర మంత్రి హామీ

నెల్లూరు, జనవరి 21,: కావలిలో భూమిని కేటాయిస్తే వచ్చే ఏడాది నుంచి కేంద్రీయ విద్యాలయానికి సహకరిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి హామీనిచ్చారు.వెంకటాచలంలో మంగళవారం ప్రాచీన అధ్యయన తెలుగు కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ విషయమై మాట్లాడారు. అంతకుముందు అక్షర విద్యాలయంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు,కేంద్ర మంత్రిని కలిసి పుష్ప పుష్పగుచ్ఛాలు అందించారు. శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా వారితో సాగిన మాటామంతి లో జిల్లా సమస్యల ప్రస్తావన చేసి ఆయన నుంచి ఆ హామీని రాబట్టారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here