ఎయిరిండియా వాటా అమ్మకం ప్రక్రియ మళ్లీ ప్రారంభం

0
157

లోక్సభలో ఎంపీ ఆదాలకు తెలిపిన విమానయాన శాఖ మంత్రి

నెల్లూరు, నవంబర్‌ 21 : ఎయిర్ ఇండియా వాటా అమ్మకం ప్రక్రియ మళ్లీ ప్రారంభమైందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. లోక్సభలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎయిర్ ఇండియాలో వాటా అమ్మకం గురించి అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా జవాబిచ్చారు. ఎయిర్ ఇండియాలోని వాటా విక్రయ నిర్ణయం గతంలోనే జరిగిందని హర్దీప్ సింగ్ పురి లిఖితపూర్వకంగా తెలిపారు. 2018 మార్చి 28న ఈ మేరకు బిడ్లను కూడా ఆహ్వానించారని ఆయన గుర్తు చేశారు. 2018 మే 31 వరకు ఎటువంటి బిడ్లు దాఖలు కాలేదని ఆయన స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ప్రక్రియను మళ్లీ ప్రారంభించారని తెలిపారు. ఇందులో ఉద్యోగుల అవసరాలు కూడా ఇమిడి ఉన్నాయని పేర్కొన్నారు. 2019 మార్చి 31 వరకు 58,222. 92 కోట్ల రూపాయల అప్పు ఉందని తెలిపారు.

గత్యంతరంలేకనే గోవా విమానం అత్యవసర లాండింగ్

గోవా నుంచి ఢిల్లీ వెళ్లే ఇండిగో విమానం అత్యవసరంగా గోవా ఎయిర్పోర్టులో ఈ ఏడాది అక్టోబర్ 29న దించాలిసి వచ్చిందని విమానయాన శాఖ మంత్రి తెలిపారు. విమాన ప్రమాదాల పై ఆందోళన వ్యక్తం చేస్తూ, దీనిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యక్తం చేసిన అనుమానాలను వివరిస్తూ ఆయన పై విధంగా సమాధానం తెలిపారు. విమాన తయారీ సంస్థ ఆదేశాల మేరకు అన్ని పరీక్షలు జరిపి విమానాలను నడుపుతున్నామని, అకస్మాత్తుగా యాంత్రిక లోపం తలెత్తడం వల్ల దానిని దించవలసి వచ్చింది అని పేర్కొన్నారు. తనిఖీల్లో లోపాలు నిర్లక్ష్యం తలెత్తినట్లు గుర్తిస్తే విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ తగిన చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here