అసాంఘిక శక్తుల ఏరివేతే లక్ష్యంగా కార్డన్ అండ్‌ సర్చ్ – నగర డిఎస్పి

0
165

శ్రీలంక కాలనీలో కార్డన్ సర్చ్ నిర్వహించిన నెల్లూరు టౌన్ పోలీసులు
33 బైకులు, 2 ఆటోలు, 2 కార్లు స్వాధీనం
నెల్లూరు, నవంబర్‌ 28 : నేర నిరోధాలకి ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా చట్టపరిధిలో నెల్లూరు నగర డియస్పి జి.శ్రీనివాసులు రెడ్డి, ట్రాఫిక్ డియస్పి పి.మల్లికార్జున రావుల ఆద్వర్యంలో టౌన్, ట్రాఫిక్, స్పెషల్ పార్టీలు సిసిఎస్‌ సిబ్బందితో కలిసి శ్రీలంక కాలనీలో గురువారం కార్డన్ సర్చ్ నిర్వహించి ఎలాంటి డాకుమెంట్స్ లేని 33 బైకులు, 2 ఆటోలు, 2 కార్లతో పాటు స్వాధీనం చేసుకున్నారు. వేదాయపాలెం పి.యస్. పరిధిలో గల లంక కాలనీకి అనుబంధంగా ఉన్న ప్రాంతాలలో అసాంఘిక చర్యలకు పాల్పడే వ్యక్తులు, వారి కదలికలు మరియు వారు వాడే వస్తువులు వాహనాలు ఉండవచ్చు అనే సమాచారం మేరకు కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా శోధించామని నెల్లూరు నగర డియస్పి తెలియజేసారు.ఈ సందర్భంగా నగర టౌన్ డియస్పి మాట్లాడుతూ జిల్లా యస్పి ఐశ్వర్య రస్తోగి నేరాలు, దొంగతనాలు నిరోధించే క్రమంలో అసాంఘిక శక్తుల ఏరివేతే లక్ష్యంగా ఇప్పటికీ జిల్లా అధికారులు అందరికీ యస్పి నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసినారని అందులో భాగంగానే సామాన్య ప్రజలలో ధైర్యం నింపుతూ పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంచటానికి ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు. ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ లో నెల్లూరు నగర డియస్పి ఔ శ్రీనివాసులు రెడ్డి , ట్రాఫిక్ డియస్పి పి.మల్లికార్జున రావు, సి.సి.యస్. సి.ఐ. బాజీ జాన్ సైదా, నవాబ్ పేట సి.ఐ. కె.వేమారెడ్డి, సంతపేట సి.ఐ. కె.రాములు నాయక్, దర్గామిట్ట సి.ఐ. యం.నాగేశ్వరమ్మ, వేదాయపాలెం సి.ఐ. టి.వి. సుబ్బారావు, బాలాజీ నగర్ సి.ఐ. వై.వి.సోమయ్య, ట్రాఫిక్ సి.ఐ. ఐ. ఆంజనేయ రెడ్డి, యస్.ఐ.లు సిబ్బంది మొత్తం 122 మంది పోలీసు బృందం పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here