వైకాపా ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులకు అదుపే లేదు… చేజర్ల

0
97

వైకాపా ప్రభుత్వం లో నిత్యావసర వస్తువులు ధరలకు ఆదుపేలేదు,ఆ శాఖ మంత్రికి నోటికి హద్దే లేదు.చేజర్ల

వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలకు ఆదుపేలేదని అదేవిధంగా వాటిని అదుపు చేయవలసిన మంత్రి నోటికి హద్దే లేదని కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయములో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు పనులు లేక రాబడి లేక కుటుంబ జీవనం ఎలా సాగాలో తెలియక అయోమయ పరిస్థితులలో ఉన్న సమయములో మూలిగే నక్క పై తాటి కాయ పడినట్లు అడ్డు,అదుపు లేకుండా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల వలన కుటుంబాలు కుదేలు అవుతున్నవని,ఉప్పు,పప్పు కూడా కొనే పరిస్థితి లేదని,రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకి పెరిగి పోతున్న రాష్ట్ర ప్రభుత్వం లో కనీస స్పందన కూడా లేదని,గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రేషన్ షాపుల ద్వారా సబ్సిడీ ధర పై ప్రతి కుటుంబానికి నెలకు రెండు కిలోల కంది పప్పు ఇవ్వగా ఈ ప్రభుత్వం దానిని కిలోకి తగ్గించారని అదేవిధముగా రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ను నియంత్రించవలిసిన పౌర సరఫరాల శాఖామంత్రి కొడాలి నాని ఆ పని వదిలేసి ప్రతిపక్ష పార్టీల ను తిట్టడమే పని గా పెట్టుకున్నారని అందువలన ప్రభుత్వ నియంత్రణ లేక వ్యాపారులు కుత్రిమ కొరత సృష్టించి సరుకుల ధరలను విపరీతంగా పెంచుతున్నారని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లో ఉన్న మార్చి నెలలో ఉన్న ధరల కంటే నేడు ఉన్న వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, గతములో నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడయినా పేరిగితే నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి రేట్లు పెరగడానికి గల కారణాలు తెలుసుకొని అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి సరుకులు దిగుమతి చేసుకుని రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రణ చేసారని, కానీ నేటి ప్రభుత్వం లో వాటి గురుంచి పట్టించుకొనే నాధుడే కరువయ్యారని,ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం అన్నారు.ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఏలూరు క్రిష్ణయ్య, దారా విజయబాబు, శివుని రమణారెడ్డి, ఇందుపురు మురళీకృష్ణ రెడ్డి బుధవరపుశివకుమార్,గొర్రిపాటి నరసింహ, కలువాయి చెన్నకృష్ణా రెడ్డి, ఉయ్యురువేణు,బత్తుల రమేష్ అగ్గి మురళి పులా వెంకటేశ్వర్లు, సోమవరపు సుబ్బారెడ్డి , గరికిపాటి అనిల్ తదితరులు పాల్గొన్నారు.*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here