“లోక్‌ అథాలత్‌”ద్వారా కక్షిదారుల సమస్యలు పరిష్కారం

0
133

నెల్లూరు, సెప్టెంబర్‌ 14,: కక్షిదారులకు సంబంధించిన కేసులు కోర్టుల కంటే లోక్ అదాలత్‌ల ద్వారానే త్వరగా పరిష్కరించబడతాయని ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జి.వెంకటకృష్ణయ్య పేర్కొన్నారు.శనివారం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రెండు నెలలకొకసారి నిర్వహింపబడే జాతీయ లోక్ అదాలత్ లో మోటారు వాహనాల చట్టం క్రింద వున్న కేసులు, చెక్కు డిజానర్ అయిన కేసులు అలాగే ఇద్దరిమధ్య వుండేటటువంటి నగదు లావాదేవీలకు సంబంధించిన కేసులు, కుటుంబపరంగా వుండేటటువంటి తగాదాల కేసులు, రకరకాల కేసులు క్రిమినల్ కేసులలో చిన్న చిన్న కేసులు (కాంపౌండ్ బుల్ కేసులు) కూడా ఈరోజు జిల్లా మొత్తం జరుగుతుందని, అలాగే దేశం మొత్తం మీద జరుగుతుందన్నారు. ఈ రోజు మోటారు వాహనాల చట్టం కేసుకు సంబంధించి ఇన్సూరెన్స్ కం పెనివారు, ఫిర్యాదుదారులు కూర్చుని కేసుని పరిష్కరించుకొని పరిహారం క్రింద ఫిర్యాదుదారు 60 లక్షలు పొందడం జరిగిందన్నారు. పలు కేసులలో 7 కోట్ల 86 లక్షల వరకు పరిహారం చెల్లించబడిందన్నారు. లోక్ అదాలత్ లో రెండు రకాల ఉపయోగాలున్నాయని, 1. లోక్ అదాలత్ లో రాజీపడినటువంటి కేసు మళ్లీ తిరగతోడడం, అప్పీల్ చేయడం వుండవని, 2. కోర్టు ‘ఫీజు ఏదైనా కట్టి వుంటే దానిని తిరిగి యివ్వబడుతుందన్నారు. ఈ రెండు ఉపయోగాలను గుర్తించి న్యాయవాదులు కూడా ఎక్కువగా లోక్ అదాలత్ ద్వారానే కేసులను పరిష్కరించడానికి మొగ్గుచూపుతున్నారన్నారు. మీడియేషన్ సెంటర్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయవలసి వుందని, కొంతమంది సీనియర్ న్యాయవాదులలో మీడియేషన్ ట్రైనింగ్ అయినవారు చాలా కేసులలో మీడియేషన్ నిర్వహించి కేసులను పరిష్కరిస్తున్నారన్నారు. కక్షిదారులు కోర్టుకు
వెళ్లటంకంటే లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవడానికి ప్రోత్సాహమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లోక్‌అథాలత్‌ సెక్రటరీ సీనియర్‌ సివిల్‌ జడ్జ్‌ పి.జె.సుధ, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here