రైలు ఢీకొని వి ఆర్ లా కాలేజీ విద్యార్థి మృతి

0
141

*రైలు ఢీకొని వీఆర్ లా కాలేజీ విద్యార్థి మృతి*..
*హెడ్ ఫోన్స్ పెట్టుకుని నిర్లక్ష్యంగా.. ట్రాక్ దాటుతూ*
..
*నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. సెల్ ఫోన్ ముచ్చట్లలో మునిగిపోయాడో లేక, మ్యూజి వింటున్నాడో.. చెవులకు ఇయర్స్ ఫోన్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్ దాటబోయాడు నెల్లూరు వీఆర్ లాకాలేజీ విద్యార్థి రామ్ ప్రతాప్ రెడ్డి. అదే సమయంలో అటుగా వస్తున్న రైలుని ఆ విద్యార్థి గమనించలేదు. సెకన్ల వ్యవధిలో ఘోరం జరిగిపోయింది. రైలు ఢీకొనడంతో విద్యార్థి దేహం నుజ్జునుజ్జయింది. అక్కడే ప్రాణం పోయింది. వందమీటర్ల దూరంలో కాలేజీ, ట్రాక్ దాటితే క్లాస్ లోకి వెళ్లాల్సిన వాడు. అంతలోనే ఘోరం జరిగింది. బుచ్చి ప్రాంతం నుంచి కాలేజీకి వచ్చే రామ్ ప్రతాప్ రెడ్డి ప్రతిరోజూ పూలే బొమ్మ దగ్గర బస్సుదిగి.. అక్కడినుంచి కాలినడకన కాలేజీకి వచ్చేవాడు. ఈ క్రమంలో రోజూ రైల్వే ట్రాక్ దాటేవాడు. అప్రమత్తంగా లేకపోవడంతో.. రైలు ఢీకొని దుర్మరణంపాలయ్యాడు. ఈ సంఘటన జరిగిన కాసేపటికే.. ఓ వృద్ధుడు అదే ట్రాక్ పై రైలుకిందపడి ఆత్మహత్య చేసుకోవడం మరో విషాదం……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here