ముందస్తు జాగ్రత్తలతో కరోనా దూరం

0
57

ముందస్తు జాగ్రత్తతో కరోనా దూరం

కరోనా వైరస్ తో బాధపడటం కంటే ముందస్తు జాగ్రత్త తీసుకోవడం మంచిదని ప్రభుత్వ వైద్యశాల తరఫున డాక్టర్ మోయిన్ పేర్కొన్నారు. రామకృష్ణ ఆర్కిడ్ ఇంగ్లీష్ మీడియం స్కూలు ఆధ్వర్యంలో శుక్రవారం కలవరపెడుతున్న కరోనా వ్యాధి పట్ల అవగాహనా ర్యాలీ రాంజీనగర్ నుండి హరనాధ పురం సెంటర్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దగ్గు, తుమ్ములు, ముక్కు నుండి నీరు కారడం వంటి లక్షణాలు ఉన్న వారికి దూరంగా ఉండాలని, మాస్కులు ధరించాలని, దగ్గినా తుమ్మినా జేబురుమాలు అడ్డం పెట్టుకోవాలని తెలియజేశారు. కరోనా వ్యాధి మొదట చైనాలోని ‘ఉహాన్’ అనే ప్రాంతంలో బయటపడింది ఈ వైరస్ ను మొట్టమొదట 1960వ సంవత్సరంలో కనుగొన్నారు. దీనిని మైక్రోస్కోప్ లో పరీక్షించగా ఇది కిరీటం ఆకారంలో ఉండటం వలన ఈ వైరస్ కు కరోనా అని నామకరణం చేశారని తెలిపారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ కొర్రపాటి మురళీమోహన్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ గబ్బిలాలు, పాముల నుండి మనిషికి సోకుతుందని.. తర్వాత గాలి ద్వారా మనిషి నుండి మనిషికి వ్యాపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కేరళలో కరోనా వైరస్ బాధితుడిని గుర్తించడంతో మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోని వ్యాధిగ్రస్తులకు చికిత్స నిర్వహించెందుకు చర్యలు చేపట్టారని.. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్ర జిల్లా యువ సమన్వయ అధికారి ఆకుల మహేందర్ రెడ్డి, స్కూల్ కరస్పాండెంట్ చిల్లర శశిధర్, పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. మురళీ మోహన్ రాజు, గౌరవ అధ్యక్షుడు టి. వెంకటేశ్వర్లు, ప్రభుత్వ జిల్లా వైద్య సిబ్బంది, విద్యార్థులు, తదితరులు ర్యాలీ లో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here